పెళ్లికి కూడా ఇన్సూరెన్స్ పాలసీ, తీసుకుంటే ఏంటి ప్రయోజనం?

వివాహం అనేది మనందరి జీవితంలో అతి ముఖ్యమైన, ఖరీదైన వేడుక. కేవలం రెండు మనస్సులను మాత్రమే కాదు.. రెండు కుటుంబాలను, ఎంతో మందిని ఒక్కచోట కలిపే వేదిక వివాహం. ఇలాంటి వివాహాలకు భారీ మొత్తంలో ఖర్చు పెడుతూంటారు మన భారతీయులు. అయితే అంత ఖర్చు పెట్టేడప్పుడు ఏదైనా అనుకోని అవాంతరం ఎదురై పెళ్లి ఆగిపోతే.. మొత్తం ఖర్చు దండగ. అందుకే అపురూపమైన ఈ వేడుకకు బీమా రక్షణ అవసరం అన్నది భీమా నిపుణుల సూచన. 
మిగతా అన్ని ఇన్సూరెన్స్ ల మాదిరిగానే  వెడ్డింగ్ ఇన్సూరెన్స్ కూడా పనిచేస్తుంది. అనుకోని ఘటనలు ఎదురైతే వివాహ వేడుక పరంగా కలిగే నష్టాలను భరిస్తుంది ఈ పాలసీ.  వెడ్డింగ్ ఇన్సూరెన్స్ ను చాలా రకాల కంపెనీలు ఆఫర్ చేస్తున్నాయి. 
ఇరువైపుల కుటుంబాల్లో ఎవరైనా అకాల మరణం చెందితే పెళ్లి ఆగిపోతుంది. లేదా ఏదైనా అనుకోనిది జరిగినా ఇదే పరిస్థితి ఎదురవుతుంది. ఇలాంటి సమయాల్లో పెళ్లి కార్డుల ప్రింటింగ్ కు అయిన ఖర్చు, వాటి పంపిణీ వ్యయం, కేటరర్లు, వెండర్లు, ఆభరణాల కొనుగోలు, వేదిక అలంకరణకు అయిన వ్యయంలో కొంత మేర పరిహారంగా బీమా కంపెనీ అందిస్తుంది.   దురదృష్టవశాత్తూ వివాహ సమయంలో ఫైర్ యాక్సిడెంట్ అయితే నష్టాన్ని పెళ్లి బీమా పూరిస్తుంది. దొంగతనం, దోపిడీకి పెళ్లి వేడుకల్లో అవకాశం ఉంటుంది. కనుక పెళ్లి బీమా ఇలాంటి వాటికీ రక్షణనిస్తుంది.